మాస్టారుగా మారిన కలెక్టర్

మాస్టారుగా మారిన కలెక్టర్

నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ కాసేపు లెక్కల మాస్టారుగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. బుధవారం కలెక్టర్ తాడూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం సజావుగా కొనసాగుతుందో లేదో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓ తరగతి విద్యార్థులకు గణిత బోధన చేశారు.