VIDEO: భర్తపై వేడినూనె పోసిన భార్య, అత్త
TPT: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గూడూరు ఇందిరానగర్‌లో బెల్లంకొండ రాజా దంపతులు నివాసం ఉంటున్నారు. కుటుంబకలహాలతో రాజాపై భార్య, అత్త కలిసి వేడినూనె పోశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.