మంత్రి నిమ్మలను కలిసిన ఎమ్మెల్యే
NDL: ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. అమరావతిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసి, నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టుల అంశంపై చర్చించినట్లు తెలిపారు. అదేవిధంగా రావాల్సిన నిధులు విషయంపై మాట్లాడినట్లు తెలుస్తోంది. రైతులకు వ్యవసాయ సమస్యలు తలెత్తకుండా చూడాలని మంత్రి సూచించారు.