'రోడ్లపై ప్రయాణికులు భయంతో ప్రయాణించాల్సిన పరిస్థితి'
NTR: పెనుగంచిప్రోలు మండలం శనగపాడులోని శాఖంబరి ఫ్యాక్టరీ వద్ద ప్రవహిస్తున్న వాగు చప్టా పూర్తిగా దెబ్బతిని ప్రమాదకరంగా మారిందని వైసీపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. గ్రామ సమీపంలో పూర్తిగా దెబ్బతిన్న రోడ్డును స్థానిక నాయకులతో కలిసి అయన పరిశీలించారు. రోడ్లపై ప్రయాణికులు భయంతో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.