గ్రామ సర్పంచ్‌లకు ఎమ్మెల్యే ఘన సత్కారం

గ్రామ సర్పంచ్‌లకు ఎమ్మెల్యే ఘన సత్కారం

కోనసీమ: అయినవిల్లి మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ సర్పంచుల పదవీకాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగుస్తున్న సందర్భంగా మండలంలో ఉన్న సర్పంచ్ లకు ఎంపీడీవో సరోవర్ అధ్యక్షతన ఘన సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని సర్పంచ్‌లకు శాలువా వేసి, మెమంటో అందజేశారు. పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసిన అందరికీ ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు