తూ.గో జిల్లాలోకి మండపేట.. జీవో విడుదల
కోనసీమ: మండపేట నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేస్తూ ప్రభుత్వం అధికారిక జీవో విడుదల చేసింది. నెల రోజుల గడువులో ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. 2026 జనవరి 1 నుంచి ఈ విలీనం అమలవుతుందని జీవోలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పట్టుదలతో కృషి చేసి ఈ చిరకాల ఆకాంక్షను నెరవేర్చారని కూటమి నాయకులు తెలిపారు.