రహదారుల మరమ్మతులకు డిమాండ్
SRPT: చిలుకూరు మండలం నుంచి గుడిబండ, కట్టకొమ్మగూడెం వరకు దెబ్బతిన్న రోడ్లను వెంటనే బాగు చేయాలని టీడీపీ రాష్ట్ర నాయకుడు ముత్తినేని సైదేశ్వర్ రావు కోరారు. చిలుకూరులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రోడ్ల మరమ్మతులకు నిధులు కేటాయించాలని, అలాగే అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.