డ్రంక్ & డ్రైవ్ కేసులో వ్యక్తికి శిక్ష
VZM: డ్రంక్ & డ్రైవ్‌లో పట్టుబడిన వేపాడ మండలం ఆతవ గ్రామానికి చెందిన రామకృష్ణకు 7 రోజుల జైలు శిక్ష విధించినట్లు SP దామోదర్ తెలిపారు. ఇటీవల ఎస్.కోట దేవి బొమ్మ జంక్షన్ వద్ద తనిఖీల్లో పట్టుబడగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అప్పలనాయుడు ఈరోజు జైలు శిక్ష విధించారన్నారు.