వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

TPT: తడ మండలం పూడికుప్పం గ్రామానికి చెందిన రత్నం (65) రెండు రోజులుగా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అన్ని ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో తడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఆయన తెలుగు, తమిళ భాషల్లో మాట్లాడగలరని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.