తిరుపతి రెడ్డిని కలిసిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు
VKB: కోడంగల్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తిరుపతి రెడ్డిని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి స్రీనివాస్ సతి సమేతంగా ఇవాళ హైదరాబాద్‌లో కలిశారు. నూతన దంపతులను తిరుపతి రెడ్డి ఆశీర్వదించారు. అనంతరం నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నాగప్ప, మహిపాల్, రవితేజ తదితరులు పాల్గొన్నారు.