VIDEO: కాళేశ్వరంలో ప్రారంభమైన వినాయక నవరాత్రి ఉత్సవాలు

VIDEO: కాళేశ్వరంలో ప్రారంభమైన వినాయక నవరాత్రి ఉత్సవాలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఆలయ మహా మండపంలో గణపతి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బాజా భజంత్రీలతో ఆలయ మహామండపంలోకి భక్తులు గణేశ్ విగ్రహాన్ని తీసుకొచ్చారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు.