శ్రీ రామలింగేశ్వర ఆలయాన్ని సందర్శించిన ఎస్పీ జానకి
MBNR: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అడ్డాకుల మండలంలోని కందూరు గ్రామంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలలో పాల్గొన్నారు.