తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారు: రాజాసింగ్
HYD: డాక్టర్ సయ్యద్ మొహియుద్దిన్ అరెస్ట్‌పై ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. HYDలో 3,4 రోజులుగా మకాం వేసి టెర్రరిస్ట్ మాడ్యూల్‌ను గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసిందని, మరి మన HYD, తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి వద్దే హోమ్ మంత్రిత్వ శాఖ కూడా ఉందని, కనీసం దీనిపై ఒక ప్రకటన ఇవ్వాలేదని విమర్శించారు.