గంగంపల్లిలో సీసీ రోడ్ల పనులు పరిశీలించిన ఎమ్మెల్యే
ATP: రామగిరి మండలం గంగంపల్లి సమీపంలోని దుర్గమ్మ ఆలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిటాల సునీత పరిశీలించారు. 50 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ఇక్కడ సీ.సీ. రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. పనుల నాణ్యతను స్థానిక నాయకులతో కలిసి ఆమె తనిఖీ చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.