యూరియా కొరతపై వైసీపీ పోస్ట్

కృష్ణా: గన్నవరంలో యూరియా కొరతపై YCP శుక్రవారం 'X' లో ఓ వీడియోతో పోస్ట్ చేసింది. యూరియా కోసం అన్నదాతలు అగచాట్లు పడుతున్నారని పేర్కొంది. గన్నవరంలో యూరియా కోసం ఉదయం నుంచి క్యూ లైన్లలో రైతులు ఉన్న దుకాణాదారులు స్టాక్ లేదని పంపించేశారని మండిపడింది. యూరియా కొరత గురించి ముందే తెలిసినా.. నిద్రపోతున్నావా చంద్రబాబు అంటూ ట్యాగ్ చేసింది.