ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

W.G: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు తమ సమస్యలను రాతపూర్వకంగా ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను తక్షణమే పరిష్కరించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మిగిలిన సమస్యలను ఆయా విభాగాల అధికారులతో మాట్లాడి పరిష్కరించారు.