ఇఫ్తార్ విందులో పాల్గొన్న స్పీకర్

వికారాబాద్: పట్టణంలో రంజాన్ పండుగ సందర్భంగా ఈరోజు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సత్య భారతి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వికారాబాద్ నియోజకవర్గం స్థాయి ఇఫ్తార్ విందులో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు.