తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో శ్రీవారి భక్తులు రద్దీ కొనసాగుతోంది. 15 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 82,007 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 39,154 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. రూ.3.13 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.