బోటు ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి మృతదేహం లభ్యం

విశాఖ: గొలుగొండ మండలం పొగచెట్లపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు రొయ్యల వేటకు వెళ్ళిన సమయంలో తాండవ నదిలో 2రోజుల క్రితం జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతయిన అప్పారావు మృతదేహం మంగళవారం లభ్యమైనది. రెండు రోజులుగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మరియు గజ ఈతగాళ్లు తీవ్రంగా శ్రమించి వెతికి తీశారు.