అంబాసిడర్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న CBN
AP: సీఎం చంద్రబాబు మూడు దశాబ్దాల క్రితం ఉపయోగించిన తన సొంత అంబాసిడర్ కారును పరిశీలించారు. ఉమ్మడి రాష్ట్ర CMగా ఆయన కాన్వాయ్‌లో ఉండేది. ఆ కారు 'CBN బ్రాండ్ కార్'గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆ వాహనాన్ని HYD నుంచి అమరావతిలోని TDP కార్యాలయానికి తరలించారు. పార్టీ ఆఫీసుకు వచ్చిన ఆయన తన పాత కారును చూసి, అందులో నాటి ప్రయాణ మధుర స్మృతులను గుర్తుచేసుకున్నారు.