రేపటి నుంచి సీతారాముల కళ్యాణోత్సవాలు

రేపటి నుంచి సీతారాముల కళ్యాణోత్సవాలు

VSP: సింహాచలంలోని గంగధార ప్రాంతంలో వెలసిన శ్రీ సీతారామస్వామి ఆలయంలో వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4 వరకు శాస్త్రోక్తంగా నిర్వహించబడతాయి. ప్రతిరోజూ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు కళ్యాణ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుగనున్నాయి.