VIDEO: 'పాఠశాలకు మరమ్మతులు చేయాలి'

ADB: నార్నూర్ మండలంలోని ఖైర్డాట్వా గ్రామంలో ఉన్న గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను శుక్రవారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా, సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ సందర్శించారు. అనంతరం ఉపాధ్యాయుల రికార్డులను పరిశీలించారు. పాఠశాలకు మంజూరైన నిధులతో మరమ్మతులు చేయించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సలోని ఛాప్రా తదితరులు పాల్గొన్నారు.