సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు
BDK: జిల్లాలోని శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ సతి సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు తులాభారం ద్వారా నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్ల ఆశీర్వాదాలు పొందిన ఎమ్మెల్యే రాష్ట్ర ప్రజల సౌభాగ్యం, శాంతి, సమృద్ధి కోసం ప్రార్థించారు.