నిరుపేద రోగి వైద్యానికి అండగా ఎమ్యెల్యే

నిరుపేద రోగి వైద్యానికి అండగా ఎమ్యెల్యే

కామారెడ్డి: లింగంపేట్ మండలం బాణాపూర్‌కు చెందిన ప్రకాష్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు ఆపరేషన్ తప్పనిసరి అని వైద్యులు వెల్లడించారు. బుధవారం రోగి బంధువులు ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్యెల్యే ప్రభుత్వం తరపు నుంచి చికిత్స నిమిత్తం రూ. 1,50,000 ఎల్‌వోసీ అందించారు. దీంతో రోగి బంధువులు ఎమ్యెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.