భక్తులకు మజ్జిగ పంపిణీ

భక్తులకు మజ్జిగ పంపిణీ

KDP: మహాశివరాత్రి సందర్భంగా సిద్ధవటం మండలంలోని నిత్యపూజ కోన,కపర్టీశ్వర స్వామి కోన, జ్యోతి, సిద్ధవటేశ్వర స్వామి ఆలయాలను సందర్శించు భక్తులకు భాకరాపేట యువత ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కొరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దాదాపు 25 వేల మందికి మజ్జిగ పంపిణీ చేసినట్లు వారు తెలిపారు.