చెట్ల నరికివేత.. కాంట్రాక్టర్‌కు రూ.30 వేలు జరిమానా!

చెట్ల నరికివేత.. కాంట్రాక్టర్‌కు రూ.30 వేలు జరిమానా!

నల్గొండ: అక్కలాయిగూడెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న కొన్ని వృక్షాలను అక్రమంగా నరికివేశారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఈ నరికివేతకు బాధ్యుడైన ఓ కాంట్రాక్టర్‌ను గుర్తించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ చెట్లను నరికినందుకు అతడిపై అధికారులు కేసు నమోదు చేసి, రూ.30,000 జరిమానా విధించారు.