విద్యార్థులకు వైద్య పరీక్షలు

విద్యార్థులకు వైద్య పరీక్షలు

GDWL: జిల్లా డీఎంహెచ్‌వో ఆదేశానుసారం మల్దకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం సోమవారం మండల విద్యాధికారి జి. సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 400 మంది విద్యార్థినీ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా తదుపరి వైద్య పరీక్షల కోసం 34 మంది విద్యార్థులను ఎంపిక చేశారు.