కోదండ రాముని సన్నిధిలో TTD జేఈవో
KDP: ఒంటిమిట్ట కోదండ రామయ్యను టీటీడీ జేఈవో వీరబ్రహ్మం సోమవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. ఏకశిలపై వెలసిన సీతారామ లక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం వద్ద బ్రహ్మోత్సవాలకు చేస్తోన్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు సూచనలను, సలహాలు అందజేశారు.