VIDEO: అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం
VKB: దౌల్తాబాద్ మండలం గోకఫసల్‌వాద్ గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో నిన్న అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న సిబ్బంది, మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.