రహదారిపై మురుగు నిల్వ

SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ పార్వతీశునిపేటలో మెయిన్ రోడ్డుపై మురుగు నిల్వ చేరడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. మెయిన్ రోడ్డుకు మురుగు కాలువలు లేకపోవడంతో ఇళ్ల నుంచి వస్తున్న నీరు అంతా రహదారిపై నిల్వ చేరుతుంది. దీనివలన వాహనాలు ప్రయాణానికి ఇబ్బందిగా మారుతుందని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు. సమస్యపై మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.