VIDEO: మహిళల రక్షణకు కఠిన చట్టాలు: ఎస్పీ
SRPT: మహిళల భద్రత కోసం ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేస్తోందని ఎస్పీ నరసింహ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఎస్పీ మాట్లాడుతూ.. శాస్త్ర సాంకేతిక, రాజకీయ రంగాల్లో మహిళలు అగ్రగామిగా నిలవడం శుభపరిణామన్నారు. ఎక్కడైనా లింగ వివక్ష ఎదురైతే రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకోవాలని సూచించారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ఉండాలని అన్నారు.