ఆర్టీసీ కార్గో జోరు.. ఆదాయం అదిరింది!

ఆర్టీసీ కార్గో జోరు.. ఆదాయం అదిరింది!

నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ కార్గో సేవలు విస్తరించడంతో ఆదాయం రికార్డు స్థాయిలో పెరుగుతోంది. పొరుగు రాష్ట్రాలకు రవాణా, డోర్ డెలివరీ సౌకర్యంతో ప్రజల నుంచి ఆదరణ లభిస్తోంది. నాలుగేళ్లలో ఆదాయం రూ.6.37 కోట్ల నుంచి రూ.12.20 కోట్లకు చేరినట్లు అధికారులు వెల్లడించారు. మండలాల వారీగా ఏజెన్సీల ద్వారా సేవలు మరింత చేరువయ్యాయని తెలిపారు.