భూభారతి చట్టం అమలుపై సమీక్షించిన కలెక్టర్ ప్రావిణ్య

భూభారతి చట్టం అమలుపై సమీక్షించిన కలెక్టర్ ప్రావిణ్య

HNK: ఈనెల 17వ తేదీ నుంచి భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించడానికి మండల కేంద్రాల్లో గ్రామసభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ఆదేశించారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో ఆమె భూ భారతి చట్టంపై తహసీల్దారులు, డీటీలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా కలెక్టర్ వెంకటరెడ్డి ఆర్డివో రాథోడ్ రమేష్ పాల్గొన్నారు.