మేళ్లచెరువు సహకార సంఘానికి ‘డ్రోన్’ మంజూరు

మేళ్లచెరువు సహకార సంఘానికి ‘డ్రోన్’ మంజూరు

SRPT: మేళ్లచెరువు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి (PACS) ప్రభుత్వ పథకం కింద 40% సబ్సిడీతో పురుగుమందుల పిచికారీ డ్రోన్ మంజూరైంది. ఈ డ్రోన్‌ను శనివారం మండల వ్యవసాయ అధికారి సంఘ ప్రతినిధులకు అందజేశారు. తక్కువ ఖర్చుతో, వేగంగా పిచికారీ చేసేందుకు ఈ సౌకర్యం ఎంతో ఉపయోగపడుతుందని, సంఘ సభ్యులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.