నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ప్రకాశం: మద్దిపాడు మండలంలోని పలు ప్రాంతాలలో సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లుగా విద్యుత్ శాఖ ఏ.ఈ చెన్నారెడ్డి తెలిపారు. గుండ్లపల్లి పారిశ్రామిక వాడలో నూతనంగా విద్యుత్ లైన్ వేస్తున్న నేపథ్యంలో పారిశ్రామిక వాడ పరిసర ప్రాంతాలలో ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లుగా తెలిపారు. వినియోగదారులు సహకరించాలని తెలిపారు