గుత్తి మండల ప్రజలకు శుభవార్త

ATP: గుత్తి మండలంలో బుధవారం నుంచి నూతన రేషన్ కార్డు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మండల తహసీల్దార్ ఓబులేసు మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు నేటి నుంచి నూతన రేషన్ కార్డు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని.. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.