VIDEO: లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వెంటనే జరపాలి: CPM
SKLM: కోటబొమ్మాలి మండలం కొండపేట లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని జిల్లా సీపీఎం పార్టీ ప్రధాన కార్యదర్శి ఈ గోవిందరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. మార్చి 4న జగన్నాథపురం గ్రామంలో చేపట్టబోవు జల దీక్ష కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.