'బాలల దినోత్సవం రోజున పరీక్ష వద్దు'

'బాలల దినోత్సవం రోజున పరీక్ష వద్దు'

W.G: బాలల దినోత్సవం రోజున ఎస్ఏ-1 పరీక్ష నిర్వహించడం విద్యార్థుల హక్కులను హరించడమేనని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రసాద్ అన్నారు. ఈ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ గురువారం భీమవరం డీఈవో కార్యాలయ సూపర్డెంట్ తిరుపతి రాజుకు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం ఈ విషయంపై పునరాలోచించి, పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.