ధోనీ, కోహ్లీ స్థాయిలోనే సంజూ క్రేజ్: దినేష్ కార్తీక్

ధోనీ, కోహ్లీ స్థాయిలోనే సంజూ క్రేజ్: దినేష్ కార్తీక్

వెస్టిండీస్‌పై ఆడిన ఇన్నింగ్స్‌తో సంజూ శాంసన్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన దినేష్ కార్తీక్.. సంజూకు ఉన్న క్రేజ్ సామాన్యమైంది కాదన్నాడు. ధోనీ, కోహ్లీ, రోహిత్‌లకు ఏమాత్రం తగ్గకుండా సంజూకు అభిమానులున్నారని పేర్కొన్నాడు. కెరీర్‌లో ఎన్ని ఎత్తుపల్లాలు ఎదురైనా.. అభిమానులు మాత్రం సంజూను గుండెల్లో పెట్టుకున్నారని కొనియాడాడు.