'వ్యాపారస్తులు గుడ్డ సంచులను వినియోగించుకోవాలి'

ప్రకాశం: కనిగిరి పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు అధికారులు పనిచేయాలని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ప్లాస్టిక్ వినియోగంపై దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణంలోని వ్యాపారస్తులకు గుడ్డ సంచులను వినియోగించుకోవాలని సూచించారు.