వృద్ధురాలిని చేరదీసిన గ్రామస్తులు

WGL: నెక్కొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఓ వృద్ధురాలిని స్థానిక రైతులు శుక్రవారం గుర్తించారు. ఆమె గురువారం ఉదయం నుండి అక్కడే ఉంటున్నట్లు, రాత్రి వర్షంలో తడుస్తూ కనిపించినట్లు రైతులు తెలిపారు. తన వివరాలు సరిగ్గా చెప్పడం లేదని, చలికి వణుకుతూ ఇబ్బంది పడుతున్న వృద్ధురాలిని వాగు దాటించి, పండ్లు అందించారు.