రేపు పెనుకొండలో పర్యటించనున్న మంత్రి

రేపు పెనుకొండలో పర్యటించనున్న మంత్రి

సత్యసాయి: పెనుకొండ మండలంలో మంత్రి సవిత శనివారం పర్యటించనున్నట్లు మండల టీడీపీ కన్వీనర్ శ్రీరాములు తెలిపారు. శనివారం ఉదయం 7 గంటలకు శ్రీ భక్త కనకదాసు జయంతి సందర్భంగా పెనుకొండలోని శ్రీ భక్త కనకదాసు విగ్రహానికి మంత్రి సవిత నివాళులర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.