VIDEO: కిళ్లాం రహదారికి మహర్దశ.. రూ.కోటి మంజూరు

VIDEO: కిళ్లాం రహదారికి మహర్దశ..  రూ.కోటి మంజూరు

SKLM: నరసన్నపేట మండలం కిళ్లాం పంచాయతీలో రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సహకారంతో నిధులు మంజూరు అయ్యాయని సర్పంచ్ రామన్న, ఉప సర్పంచ్ పొట్నూరు సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు ఉపాధి హామీ నిధులు కోటి రూపాయలు మంజూరు కావడంతో శుక్రవారం రహదారి నిర్మాణ పనులను ప్రారంభించామన్నారు. సుమారు కిలోమీటర్ మేర నిర్మాణం చేపడుతున్నామని వివరించారు.