ఉత్తరాంధ్రలో మరో ఎయిర్‌పోర్టు
AP: ఉత్తరాంధ్రకు మరో ఎయిర్ పోర్టు రానుంది. శ్రీకాకుళంలో నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు సంబంధించి AAI, ఏపీ ఎయిర్ పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లాకు ఎయిర్ పోర్టు రాకతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి కనెక్టివిటీ పెరగడంతో పాటు పర్యాటక రంగానికి దోహదపడుతుందని తెలిపారు.