నేడు ఉచిత మెగా వైద్య శిబిరం

E.G: బిక్కవోలు మండలం రంగాపురంలో గురువారం రాజమహేంద్రవరానికి చెందిన గంగా ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు కూటమి నేత అప్పలస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరంలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. గ్రామస్తులు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.