చాపాడు టీడీపీ నేత మునిశేఖర్ రెడ్డికి రాష్ట్ర కార్యదర్శి పదవి
KDP: చాపాడు మండలానికి చెందిన టీడీపీ నాయకుడు మునిశేఖర్ రెడ్డిని పార్టీ అధిష్టానం రాష్ట్ర కార్యదర్శిగా నియమించింది. ఈ పదవి దక్కేందుకు సహకరించిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌కు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, యువనేత నారా లోకేష్‌లకు మునిశేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మైదుకూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు శేఖర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.