హైదరాబాద్ విమానాశ్రయంపై పాకిస్థానీ ప్రశంసలు
హైదరాబాద్ విమానాశ్రయం ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అద్భుతంగా ఉందని పాక్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రశంసిస్తున్న వీడియో నెట్టింట వైరలవుతోంది. బ్యాంకాక్ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ కోసం హైదరాబాద్‌లో దిగిన ఆయన.. ఇక్కడి అత్యాధునిక సదుపాయాలను చూసి మత్రముగ్ధుడయ్యాడు. దుబాయ్, కౌలాలంపూర్ కంటే ఇదేం తక్కువ కాదని.. మల్టీ బ్రాండ్ షాపులు, సర్వీసెస్ ఉన్నాయని కొనియాడాడు.