కళాశాలలో షీ టీం అవగాహన సదస్సు
JGL: రాయికల్ పట్టణంలోని ఓ కళాశాలలో షీ టీమ్ కానిస్టేబుల్ పూజిత ఆధ్వర్యంలో విద్యార్థులకు సమాజంలో జరిగే మోసాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బందెల తిరుపతి, డైరెక్టర్లు శివప్రసాద్, నరేశ్, అధ్యాపకులు పాల్గొన్నారు.