మొసళ్ల సంచారం.. భయాందోళనలో మత్స్యకారులు

మొసళ్ల సంచారం.. భయాందోళనలో మత్స్యకారులు

NLG: నాగార్జునసాగర్ జలాశయ తీరంలో మంగళవారం మొసళ్లు కనిపించాయి. దీంతో జలాశయ తీరంలో చేపలు పట్టే మత్స్యకారులు, బట్టలు ఉతుక్కునేందుకు నీటిలోకి దిగేవారు, లాంచీ స్టేషన్‌లో లాంచీలు ఎక్కే పర్యాటకులు, విధులు నిర్వర్తించే ఎస్పీఎఫ్ సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని ఎన్ఎస్పీ అధికారులు హెచ్చరిస్తున్నారు.