రైతుల సంక్షేమానికి కృషి: AMC ఛైర్మన్

శ్రీకాకుళం ఏఎంసీ ఛైర్మన్ జ్యోత్స్న శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. తనకు ఇచ్చిన బాధ్యతను శిరసావహిస్తానని.. రైతుల సంక్షేమానికి, రైతుల ఆర్థిక ప్రయోజనాలకు తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన కూటమి అధిష్టానం నాయకులకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.